KhammamPoliticalTelangana

ఖమ్మం ఉదయ్‌నగర్‌లో భరితెగించిన అక్రమాలు?

ఖమ్మం ఉదయ్‌నగర్‌లో భరితెగించిన అక్రమాలు?

ఖమ్మం ఉదయ్‌నగర్‌లో భరితెగించిన అక్రమాలు?

వికలాంగుడి ప్లాట్‌పైనా కన్ను.. బాధితుల పోలీసులను ఆశ్రయం!

కాపాడాల్సిన వారే కబ్జాలకు పాల్పడుతున్నారా? బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన వివాదం

ఖమ్మం నగరంలోని ఉదయ్‌నగర్ ప్రాంతంలో ప్లాట్‌ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సామాన్యుల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన వారే అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా వికలాంగుడికి సంబంధించిన ప్లాట్‌ విషయంలోనూ వివాదం తలెత్తిందనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి.

వికలాంగుడి ప్లాట్‌ విషయంలో వివాదం!

వికలాంగులకు అండగా నిలవాల్సిన సమాజంలో, వారి ఆస్తుల విషయంలోనే వివాదాలు తలెత్తడం బాధాకరమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఉదయ్‌నగర్‌లోని ప్లాట్‌కు సంబంధించి తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ బాధితులు రఘునాథపాలెం పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

కమపై ఆరోపణలు.. విచారణతోనే నిజాలు వెలుగులోకి!

ప్రజల హక్కుల కోసం పోరాడాల్సిన నాయకులపై సైతం అక్రమాలకు సంబంధించి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవాలెంత? ప్లాట్‌ వివాదం వెనుక అసలు కారణాలేమిటి? బాధితులకు జరిగిన అన్యాయం ఏమిటి? అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది.

బాధితులకు న్యాయం జరిగేనా?

బాధితులు చేసిన ఫిర్యాదుపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి, ప్లాట్‌కు సంబంధించిన పత్రాలను పరిశీలించి, వాస్తవాలను వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు. భూమి యాజమాన్య హక్కులు, సంబంధిత రికార్డులు, ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన అనంతరం చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

వికలాంగుడికి న్యాయం జరిగేనా? ఉదయ్‌నగర్ ప్లాట్‌ వివాదానికి పోలీసులు ఎలాంటి పరిష్కారం చూపుతారు? అన్నది వేచి చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button