
రూ.4 వేల లంచం కేసులో పంచాయతీ కార్యదర్శికి రెండేళ్ల జైలు శిక్ష.. రూ.10 వేల జరిమానా!
Web desc : లంచం తీసుకున్న కేసులో వరంగల్ జిల్లా శాయంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి కుర్రు కుమారస్వామికి కోర్టు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో పాటు రూ.10,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. 2008లో నమోదైన ఈ అవినీతి కేసులో విచారణ అనంతరం వరంగల్‌లోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది.
ఇంటి అద్దె బిల్లు కోసం రూ.4 వేల లంచం.. 2008 సెప్టెంబర్ 6న శాయంపేటలోని వెటర్నరీ డిస్పెన్సరీ నిర్వహిస్తున్న భవనానికి సంబంధించిన ఇంటి అద్దె బిల్లు విషయంలో పంచాయతీ కార్యదర్శి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.
సుమారు రూ.25,500 విలువైన అద్దె బిల్లును తయారు చేసి, ఆ మొత్తానికి ఫిర్యాదుదారుడి పేరిట చెక్కు జారీ చేసే విషయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.4,000 లంచం తీసుకున్నట్లు కేసు నమోదైంది. అవినీతి నిరోధక చట్టం కింద శిక్ష… ఈ కేసు వరంగల్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణకు వచ్చింది.
2026 అక్టోబర్ 26న ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి, అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కె. క్షమా దేశ్‌పాండే తీర్పు వెలువరించారు. నిందితుడు కుర్రు కుమారస్వామిని దోషిగా నిర్ధారిస్తూ అవినీతి నిరోధక చట్టం, 1988లోని సెక్షన్లు 7, 13(2), 13(1)(డి) కింద రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారు.




