NationalPolitical

రూ.5 కోట్ల లంచం తీసుకున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్.. సోషల్ మీడియాలో వైరల్‌..

రూ.5 కోట్ల లంచం తీసుకున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్.. సోషల్ మీడియాలో వైరల్‌..

రూ.5 కోట్ల లంచం తీసుకున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్.. సోషల్ మీడియాలో వైరల్‌..

Social media viral : ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి భాగస్వాముల మధ్య వివాదానికి సంబంధించి పోలీస్ అధికారి ఏకంగా రూ.5 కోట్లు లంచం తీసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాడులోని తంజావూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి సుకుమారన్ అనే పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

తాజాగా, ఆయన సమక్షంలో నగదు లావాదేవీలు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. దీని వెనుక పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారి ఆదేశాల మేరకే సుకుమారన్ సెటిల్‌మెంట్ చేసినట్టు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే.. తంజావూర్‌లోని రగుమాన్ నగర్‌కు చెందిన శరవణన్.. కొంత మందితో కలిసి హాస్పిటల్ పెట్టారు. భాగస్వాముల మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం చెలరేగింది. దీనిపై ఐజీకి ఇరువర్గాలు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు శరవణన్‌తో పాటు మరి కొందరిపై కేసు నమోదుచేశారు.

ఈ క్రమంలోనే కేసును సీబీసీఐడీకి బదిలీ చేయగా.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని శరణన్ ఆరోపించారు. అంతేకాదు, ఈ కేసు నుంచి తప్పించాలంటే రూ.5 కోట్ల డిమాండ్ చేశారని క్రైమ్ బ్రాంచ్‌కి ఫిర్యాదు చేశాడు. నగదు రూపంలో రూ.3.75 కోట్లు, మిగతా రూ.1.70 కోట్లకు చెక్కును సుకుమారన్‌కు ఇచ్చినట్లు తెలిపారు.

ఈ ఫిర్యాదుతో పోలీస్ అధికారి నివాసంలో సీబీసీఐడీ అక్టోబరు 10న సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. అదే రోజు జిల్లా పోలీస్ సీబీసీఐడీ అధికారి సుకుమారన్‌ను అరెస్ట్‌ చేశారు. తాజాగా, దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో కేసు బిగుసుకుంది.

వీడియోలో టేబుల్‌పై పేర్చిన నోట్ల కట్టలు ఉండగా.. కుర్చిలో ఓ వ్యక్తి కూర్చున్నాడు. ఓ మహిళ సహా ముగ్గురు ఒకవైపున.. ఇంకోవైపున ముగ్గురు నిలబడి ఉన్నారు. వీరిలో ఒకరు టేబుల్‌పై నోట్ల కట్లను లెక్కిస్తుండటం వీడియోలో రికార్డయ్యింది. అయితే, నోట్ల కట్టలు ఉన్న సంచులను ఒకరు తమ మొబైల్ ఫోన్‌లో వీడియో తీయడం కూడా ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button