KhammamPoliticalTelangana

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యుడిపై చర్యలు తీసుకోవాలి...

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యుడిపై చర్యలు తీసుకోవాలి...

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యుడిపై చర్యలు తీసుకోవాలి...

గార్ల ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో సమయపాలన పాటించకుండా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని డిఎస్ఎఫ్ఐ మండల కమిటీ డిమాండ్ చేసింది.

ఈ ధర్నా కార్యక్రమంలో మాళోత్ శాంతికుమార్, కేళోత్ సాయికుమార్ మాట్లాడుతూ…. గార్ల 1 లో స్థానికంగా ఉన్నటువంటి పల్లే దవాఖాన వైద్య అధికారిగా విధుల్లో ఉంటూ, వర్ష భావ పరిస్థితుల్లో స్థానిక ప్రజలకు, రోగులకు అందుబాటులో లేకుండా 12 గంటలకు ముందే వైద్య ఉప కేంద్రాన్ని వదిలేసి నిత్యం వరంగల్ కి వెళ్ళిపోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

గార్ల మండలంలో స్థానికంగా ఉంటూ విధుల్లో సమయపాలన పాటించవలసిన ఈ వైద్యుడు స్థానికంగా ఉండకుండా దూరప్రాంతాలైన వరంగల్ వంటి పక్కా జిల్లాల నుండి మొక్కుబడిగా వస్తు రోగులకు అందుబాటులో ఉండకుండా తరచూ నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు, తరచూ స్థానిక సిబ్బందికి జిల్లా డిఎంహెచ్వో కార్యాలయానికి వెళ్తున్న అని చెప్పి.. ఉన్నత అధికారుల పేర్లు, సమావేశాల పేర్లు చెప్పుకుని దూర ప్రాంతమైన వరంగల్ జిల్లాకి ప్రయాణమవ్వటం నిర్లక్ష్య వైఖరి కీ నిదర్శనమన్నారు.

ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఏజెన్సీ ప్రాంతమైన గార్లలో స్థానికంగా ఉంటూ, సమయపాలన పాటిస్తూ, రోగులకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహించేలా జిల్లా కలెక్టర్, వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సూర్య ప్రకాష్,తేజిత్,చంటి, యుగేందర్, తరుణ్, వెంకన్న, శ్రీకాంత్, గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button