HyderabadPoliticalTelangana

రేవంత్.. నీ గురువు చంద్రబాబును చూసి నేర్చుకో: ఎంపీ అరవింద్

రేవంత్.. నీ గురువు చంద్రబాబును చూసి నేర్చుకో: ఎంపీ అరవింద్

రేవంత్.. నీ గురువు చంద్రబాబును చూసి నేర్చుకో: ఎంపీ అరవింద్

Web desc : ఫీజు రీయింబర్స్ మెంట్ పై ఇందూరులో బీజేపీ నిర్వహించిన రణభేరి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అరవింద్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ నీ గురువు చంద్రబాబును చూసి నేర్చుకో… ఫుట్ బాల్ ఆట మీద ఉన్న సోయి విద్యార్థుల భవిష్యత్తు మీద లేదంటూ మండిపడ్డారు అరవింద్. హైదరాబాద్ లో భూములమ్మిన పైసలతో ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఆలోచన పుట్టింది నిజమాబాద్ లోనేనని…

వైఎస్ ఆనాడు డీఎస్ ఇంట్లోనే రియంబర్స్ మెంట్ ప్రణాళికలు చేశారని అన్నారు. ఫీజు రియంబర్స్ మెంట్ అంశం కేవలం విద్యార్థులదే కాదు అందరిదీ అని అన్నారు అరవింద్. ఆనాటి పిసిసి చీఫ్ డీఎస్, బడుగు బలహీన వర్గాలు పిల్లలు ఫీజులు కట్టలేకపోతున్నారని ఆలోచన చేశారని.. 2004 లో అధికారంలోకి వస్తే ఇస్తామని మ్యానిఫెస్టోలో చేర్చారని అన్నారు .

ఫీజు రియంబర్స్ మెంట్ అమలు అయ్యాక వేలాది మంది విద్యార్థులు ఇవాలా ఉన్నత స్థితిలో ఉన్నారని… రాష్ట్ర ఆర్ధిక స్థితిని, దేశ జిడిపిని పరుగులెత్తించిన స్కిం ఇది అని…అలాంటి స్కిం ను రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేశాడని మండిపడ్డారు. పాత బకాయులు 10వేల కోట్లు, కొత్త బకాయిలు 2 వేల కోట్లు క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికీపుడు ఎన్నికలు వస్తే రేవంత్ సర్కార్ ని విద్యార్థులే కూలదోస్తారని.. విద్యార్థుల బకాయిలు డబ్బులు లేవు గాని మనవడికి పూరీలు చేసిపెట్టి కోట్లు పెట్టి ప్రమోషన్ చేసుకుంటున్నాడని అన్నారు ఎంపీ అరవింద్. ఫీజు రియంబర్స్ మెంట్ కోసం ఆంధరూ కలిసి పోరాడాలని… లేకపోతే ఒక తరం మరుగున పడిపోయే ప్రమాదం ఉందని అన్నారు.రేవంత్ రెడ్డి మెడలు వంచి విద్యార్థుల బకాయిలు వసూలు చేయిస్తామని… రేవంత్ వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోతోందని అన్నారు.

రేవంత్ రెడ్డి కేసీఆర్ కన్నా ప్రమాదకరమని.. నేను గతంలో చెప్పానని, ఇప్పుడు రేవంత్ అదే నిజం చేస్తున్నాడని అన్నారు. రేవంత్ కమీషన్ల కోసమే పని చేస్తున్నాడని…రేవంత్ , ఆయన కుటుంబం రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని అన్నారు.రేవంత్ వల్ల తెలంగాణ ప్రమాదంలో పడిందని అన్నారు.

కమీషన్ల కోసమే కేసీఆర్, రేవంత్ రాష్ట్రాన్ని అప్పుల పలు చేశారని.. తెలంగాణ రాష్ట్రం తిరిగి గాడిలో పడాలంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు. తెలంగాణలో బిజెపిని గెలిపించేందుకు ఆకాశం భూమి మధ్యలో న్యాయ బద్దంగా చేయాల్సినవి అన్ని చేస్తామని.. బీజేపీని అధికారంలోకి తెస్తామని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button