
బాలికపై ముగ్గురు ఆటో డైవర్ల పైశాచికం! ప్రేమ పేరుతో ఒకడు, వీడియోలు ఉన్నాయంటూ ఇద్దరు.. పోక్సో కేసు నమోదు!
Web desc : పోక్సో వంటి కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ ఎలాంటి భయం లేకుండా బాలికలపైన లైంగిక దాడులు నిత్యకృత్యంగా మారాయి. తాజాగా ఓ మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని చెప్పి ఒక ఆటో డ్రైవర్, బాలిక తాలూకా వీడియోలు తమ దగ్గర ఉన్నాయని బెదిరించి మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.
ప్రేమిస్తున్నానని బాలికను మోసం చేసిన ఆటో డ్రైవర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల పరిధిలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మార్తి రామకృష్ణ అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకోవడానికి మా స్నేహితుడి సలహా తీసుకుందాం అంటూ ఈనెల మూడో తేదీన తన ఇద్దరు స్నేహితులైన అదే గ్రామానికి చెందిన జాలై నవీన్, గణేష్ సహాయంతో ఆటోలో వెళ్ళారు.
ప్రేమ పేరుతో బెదిరించి లైంగిక దాడి, వీడియోలు ఉన్నాయని మరో ఇద్దరు.. పాత ఆర్టీసీ బస్ డిపో సమీపంలో అద్దెకు ఉంటున్న తన బంధువు బెటాలియన్ కానిస్టేబుల్ వెంకటేష్ గదికి తీసుకువెళ్లారు. తనతో వచ్చిన స్నేహితులను పంపించేసి రామకృష్ణ బాలికపై బలవంతంగా లైంగిక దాడి చేశాడు.
అక్కడినుండి ఇంటికి పంపించేసాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని వేరే ఆటో డ్రైవర్లు విజేందర్, బడేటి మహేష్ కు చెప్పాడు. ఇదే అదునుగా వారు తమ వద్ద వీడియోలు ఉన్నాయని ఆ బాలికను బెదిరించటం మొదలుపెట్టారు.
వేరువేరుగా ఆటోలలో తిప్పుతూ బాలికపై ఆటో డ్రైవర్ ల పైశాచికం. తాము చెప్పినట్టు వినాలని లేదంటే, ఆ వీడియోలు, ఫోటోలు బయటకు ఇస్తామని, వేరువేరుగా బాలిక పైన అత్యాచారానికి ఒడిగట్టారు.
ఎవరికీ తెలియకుండా మేము చెప్పిన ప్రదేశానికి రావాలని చెప్పి ఈనెల 4వ తేదీన విజేందర్, 5వ తేదీన బడేటి మహేష్ ఆటోలలో నిర్మానుష్య ప్రాంతాలలో తిప్పుతూ బాలిక పైన లైంగిక దాడి చేశారు. అయితే అవి అక్కడికి ఆగకపోవడంతో మళ్ళీ మళ్ళీ రావాలని బెదిరింపులకు గురి చేస్తున్న క్రమంలో బాలిక జరిగిన విషయాన్ని 11వ తేదీన తల్లికి చెప్పింది.
పోక్సో కేసు నమోదు .. నిందితులు అరెస్ట్
దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రామకృష్ణ, విజేందర్, మహేష్, నవీన్ లను అరెస్ట్ చేశారు. వీరికి సహకరించి ఇంటి రూమ్ ఇచ్చిన కానిస్టేబుల్స్ వెంకటేష్, గణేష్ లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.




