Bhadradri KottagudemPolitical

నాకు ఒక్క అవకాశం కల్పిస్తే అంకితభావంతో పనిచేస్తా... కొండపల్లి సరిత

నాకు ఒక్క అవకాశం కల్పిస్తే అంకితభావంతో పనిచేస్తా... కొండపల్లి సరిత

ఇల్లందు 24 ఏరియాలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న

23 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని కొండపల్లి సరిత ప్రచారం..

ఇంటింటి ప్రచారానికి భారీ స్పందన..

గెలిస్తే అంకితభావంతో వార్డు ప్రగతి: కొండపల్లి

తనకు ఒక్క అవకాశం కల్పిస్తే అంకితభావంతో పనిచేసి వార్డును ప్రగతి వెలుగుల వైపు నడిపిస్తానని పట్టణంలోని 23 వ వార్డు అభ్యర్థిని కొండపల్లి సరిత అన్నారు. వార్డులో శనివారం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలు కోరం కనకయ్య మున్సిపాలిటీని వున్న పరిధిలోఎంతో అభివృద్ధి చేశారని ఆమె పేర్కొన్నారు.

సిసి రోడ్లు, అంతర్గత కాలువల నిర్మాణం పెద్ద ఎత్తున జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చేయాలంటే తనకు అవకాశం కల్పించాలని ఆమె ఓటర్లను కోరారు.

కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటు, ఉచిత బస్సు లాంటి సదుపాయాలను మహిళలకు కల్పించిందని, పార్టీ చేసిన మంచి పనులు వార్డుల్లో తమను గెలిపిస్తాయని ఈ సందర్భంగా సరిత అన్నారు.

ఈ 23 వార్డులో కాంగ్రెస్ పార్టీపై జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కార్యకర్తలు మహిళా కాంగ్రెస్ కార్యకర్తల తోపాటు తదితరులు పాల్గొన్నారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button