
సైబర్ క్రైమ్ కేసులో ఖమ్మం యువకులు
ఖమ్మం : సైబర్ క్రైమ్ కేసులో ఖమ్మంలోని ఇద్దరు యువకులను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తమిళనాడు రాష్ట్రంలోని తిన్నెవేలీ జిల్లాలో ఓ ముఠా ఆన్ లైన్ లో వ్యాపారం నిమిత్తం ప్రజల నుంచి అధిక మొత్తంలో నగదు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ వ్యవహారంలో రఘునాథపాలెం మండలంలోని వి. వెంకట పాలెం చెందిన ఇద్దరు యువకులకు సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది.
దీంతో శనివారం సాయంత్రం తమిళనాడు పోలీసులు ఖమ్మం చేరుకొని రఘునాథ పాలెం పోలీసుల సాయంతో వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. రూ.15 లక్షల రూపాయలు అకౌంట్లో ద్వారా బదలాయింపు జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది.
ఇద్దరు యువకులు తమిళనాడు పోలీసులు అదుపులో ఉన్నారు. రఘునాథ పాలెం లో తమిళనాడు పోలీసులు సైబర్ క్రైమ్ విషయంలో రావడంతో మండలంలో కలకలం సృష్టించింది.




