HealthPoliticalsuryapetaTelangana

ప్రాణం తీసిన పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు…!

ప్రాణం తీసిన పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు…!

ప్రాణం తీసిన పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు…!

Web desc : సూర్యాపేట జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ట్యాబ్లెట్ ఓ వ్యక్తి ప్రాణం తీశాయి. కాలు నొప్పి తగ్గేందుకు అధిక మోతాదులో మాత్రలు వేసుకున్న వ్యక్తి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

దీంతో అతడి కుటుంబంలో విషాదం అలుముకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భగత్‌సింగ్‌ నగర్‌ కాలనీకి చెందిన పుల్లూరి కనకయ్య కూలీగా జీవనం సాగిస్తున్నాడు.

గతంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కనకయ్య కాలు విరిగింది. దీంతో డాక్టర్లు సర్జరీ చేయగా.. ఆ తర్వాత కోలుకున్నాడు.

అయితే కొద్ది రోజుల క్రితం అదే కాలుకు గాయమైంది. అప్పటి నుంచి భరించలేని నొప్పితో కనకయ్య బాధపడుతున్నాడు. ఈ నొప్పిని భరించలేక ఈనెల 16న కనయయ్య అధిక మోతాదులో పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వేసుకున్నాడు.

మాత్రలు వేసుకున్న రెండు గంటల తర్వాత నీరసంగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం గవర్నమెంట్ హాస్పిటల్ తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరుసటి రోజు మరణించాడు.

అధిక మోతాదులో ఫెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకోవడం వల్లే కనకయ్య మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటన కనకయ్య కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button