HealthHyderabadPoliticalTelangana

వైద్యం వికటించి 6 నెలల బాబు మృతి...

వైద్యం వికటించి 6 నెలల బాబు మృతి...

హైదరాబాద్‌లో గడువు ముగిసిన ఇంజెక్షన్ ఇచ్చిన వైద్యులు.. 6 నెలల బాబు మృతి

బండ్లగూడ జాగీరు – సన్ సిటి పరిధిలో రాము అనే 6 నెలల బాబుకు జ్వరం రావడంతో సమీపంలోని
క్రియాన్స్ ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు

అక్కడ వైద్యులు గడువు ముగిసిన ఇంజెక్షన్ ఇచ్చినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణలు

ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే ఆరోగ్యం విషమించి మృతి చెందిన బాలుడు

ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని, సంబంధింత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేసిన బాధిత కుటుంబసభ్యులు

ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసి, ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన స్థానికులు

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

నగరంలోని ఓ ఆస్పత్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆరు నెలల శిశువు చికిత్స పొందుతూ మృతి చెందింది.

అయితే సాధారణ జ్వరంతో ఆస్పత్రికి వెళ్లామని..వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ ప్రాణాలు పోయాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

ఏం జరిగిందంటే..

పోలీసుల కథనం మేరకు.. సన్ సిటీకి చెందిన దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు కాగా.. ఇటీవల బాబు జన్మించాడు. ఆరు నెలల వయసున్న బాబుకు స్వల్పంగా జ్వరం రావడంతో తల్లిదండ్రులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అయితే జ్వరంతో వెళ్లిన బాబుకు.. వైద్యులు అత్యవసర సమయాల్లో (Emergency) ఇచ్చే ఇంజెక్షన్ ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంజెక్షన్ ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే పసికందు శరీరం రంగు మారిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఆస్పత్రి యాజమాన్యం గడువు ముగిసిన (Expired) మందులు ఇచ్చిందని, దీనివల్లే తమ బిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టిన బాబు కావడంతో అల్లారుముద్దుగా చూసుకున్నామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత..

శిశువు మృతి వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రికి చేరుకుని ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఆస్పత్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button