KhammamPoliticalTelangana

శెట్టిపల్లి అప్పారావు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే రాందాస్ నాయక్

శెట్టిపల్లి అప్పారావు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే రాందాస్ నాయక్

శెట్టిపల్లి అప్పారావు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే రాందాస్ నాయక్

సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్‌ నరసింహ ఏన్కూరు అక్టోబర్ 04 2026: మండల పరిధిలోని గార్లఒడ్డుకు చెందిన శెట్టిపల్లి వెంకటేశ్వరరావు సోదరుడు శెట్టిపల్లి అప్పారావు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోత్‌ రామదాసు నాయక్‌ ఆదివారం గార్లఒడ్డుకు చేరుకుని శెట్టిపల్లి అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకుని, ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు.
అప్పారావు మృతి పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే మాలోత్‌ రామదాసు నాయక్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.అప్పారావు మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు విషాదంలో ఉన్నారు. విషయం తెలుసుకున్న పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు, బంధువులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button