
హైదరాబాద్‌లో తీవ్ర విషాదం…. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మ*హత్య
హైదరాబాద్ అంబర్‌పేట్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మృతులు రామ్ రాజ్ (55), మాధవి (50), శశాంక్ (24) గా గుర్తించారు.అయితే వీరి ఆత్మహత్యకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు.
మంగళవారం ఉదయం ఎంత సేపు అయినప్పటికీ తలుపులు తీయకపోవడంతో ఇరుగుపొరుగువారికి అనుమానం వచ్చింది. తీరా చూస్తే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో స్థానికులు, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
సూసైడ్ నోట్ ఏమైనా రాసి ఉంటారా? అన్న అనుమానంతో ఇంటిని క్షుణ్ణంగా తనికీ చేస్తున్నారు. మరోవైపు బంధువులు మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.




