
హనుమాన్ దేవాలయంలో తీవ్ర కలకలం.. నమాజ్ చేస్తూ పట్టుబడ్డ వ్యక్తి
మల్కాజ్గిరి కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రతాపసింగారంలో బుధవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఓ గుర్తు తెలియని వ్యక్తి స్థానికంగా అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలోని హనుమాన్ దేవాలయం పై నమాజ్ చదువుతున్నాడని స్థానికులు గుర్తించారు.
దేవాలయానికి చేరుకున్న బీజేవైఎం నాయకులు, స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంఘటన స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వ్యక్తి నమాజ్ చేస్తున్నప్పుడు చూసిన బీజేవైఎం నేతలు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సదరు వ్యక్తి పేరు జుబేర్గా తెలుస్తుంది. ఈ ఘటన పై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



