
ఆర్ఎంపీ డాక్టర్ బలవన్మరణం…
web desc : కరీంనగర్ జిల్లా మానకొండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేగురుపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చెడు అలవాట్ల కారణంగా జీవితంపై విరక్తి చెంది ఓ ఆర్ఎంపీ వైద్యుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేగురుపల్లికి చెందిన మండల సంతోష్‌రెడ్డి (47) ఆర్ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఆయనకు మద్యం తదితర వ్యసనాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన సంతోష్‌రెడ్డి ఆగస్టు 13న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంట్లోనే పారాక్వాట్ విషం సేవించారు.
కొద్దిసేపటికే తీవ్ర కడుపునొప్పి రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను కరీంనగర్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో అదే రోజు సాయంత్రం 6:26 గంటలకు మృతి చెందారు.
ఈ ఘటనపై మృతుడి భార్య మండల లీలావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆగస్టు 14న ఉదయం మానకొండూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగిస్తున్నారు.




