
గుర్తు తలియని వాహనం ఢీకొని మహిళ మృతి.. కుటుంబంలో విషాదం
సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఫిబ్రవరి 27 2026: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
స్థానిక ఎస్ఐ సంధ్య తెలిపిన వివరాల ప్రకారం, ఏన్కూరు గ్రామానికి చెందిన డి కన్నమ్మ (60) అనే మహిళ శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల నుండి మూడు గంటల ప్రాంతంలో గార్లఓడ్డు గ్రామ సమీపంలో రహదారి పక్కగా నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతురాలి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సంధ్య తెలిపారు.
ఢీకొట్టి పరారైన వాహనం గురించి సమాచారం సేకరించేందుకు,ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.




