KhammamPoliticalTelangana

ఖమ్మం జిల్లాలో దా*రుణం…

ఖమ్మం జిల్లాలో దా*రుణం…

ఖమ్మం జిల్లాలో దా*రుణం…

Khammam : కూతురుతో చనువుగా ఉంటున్న వ్యక్తిని గట్టిగా హెచ్చరించాడు. ఇదే ఆ పెద్దాయన కొంపముంచింది. ఇద్దరు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కోపంతో రగిలిపోయిన ఆయువకుడు వృద్ధుడని చూడకుండా నిర్దాక్షిణ్యంగా కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పడమటితండాలో బానోతు సాయి 20 ఏళ్లుగా మెకానిక్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో ఇంటి పక్కనే ఉండే గుగులోతు రామచంద్రు పెద్ద కుమార్తెకు కొన్నేళ్ల క్రితం వివాహమైనా భర్తను వదిలివేసి ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి ఇంట్లో ఉంటోంది.

ఆమెతో సాయికి వివాహేతర సంబంధం ఏర్పడింది. రామచంద్రు ఖమ్మం రూరల్ మండలం బారుగూడెంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. తాజాగా పడమటి తండాలో బంధువుల ఇంట్లో ఓ కార్యానికి రామంచంద్రు వచ్చాడు.

అక్కడికి సాయి కూడా రావడంతో తన కుమార్తెతో సంబంధంపై నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో సాయి కత్తితో రామచంద్రుపై దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.

అనంతరం నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. వివాహేతర సంబంధంపై ప్రశ్నించిన రామచంద్రును సాయి హతమార్చడంతో పడమటితండాలో ఉద్రిక్తత నెలకొంది.

ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేదీలేదని ఆయన బంధువులు అడ్డుకున్నారు. అంతేకాక సాయిని చంపి పగ తీర్చుకుంటామని పట్టుబట్టారు.

దీంతో ఉద్రిక్తత నెలకొనగా.. భారీగా మోహరించిన పోలీసులు, ఎట్టకేలకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button