HyderabadPoliticalSPORTS

ఆన్‌లైన్ బెట్టింగ్ కు మరో నిండు ప్రాణం బలి..

ఆన్‌లైన్ బెట్టింగ్ కు మరో నిండు ప్రాణం బలి..

ఆన్‌లైన్ బెట్టింగ్ కు మరో నిండు ప్రాణం బలి.. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ*హత్య

హైదరాబాద్ నగరంలో ఆన్‌లైన్ బెట్టింగ్ మహమ్మారి మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి బెట్టింగ్ యాప్‌ల మాయలో పడి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడు.

చివరకు అప్పులు తీర్చే మార్గం లేక, తీవ్ర మనస్తాపంతో తన నివాసంలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. వెంకటేశ్వర్ రెడ్డి గత కొంతకాలంగా వివిధ ఆన్‌లైన్ గేమింగ్ మరియు బెట్టింగ్ యాప్‌లకు బానిసయ్యాడు.

ఈ క్రమంలో దాదాపు రూ. 15 లక్షల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు పెరగడం, పోగొట్టుకున్న డబ్బును తిరిగి సంపాదించలేక పోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button