KhammamPoliticalTelangana

నాచారంలో తప్పిన పెను ప్రమాదం

నాచారంలో తప్పిన పెను ప్రమాదం

నాచారంలో తప్పిన పెను ప్రమాదం

వరద నీటిలో చిక్కుకున్న భక్తుల కారు.. ట్రాక్టర్‌తో సురక్షితంగా బయటకు

సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఆగస్టు 09 2026: ఏన్కూరు మండలం నాచారం వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి సమీపంలో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వెళ్తున్న భక్తుల కారు భారీగా ప్రవహిస్తున్న వరద నీటిలో చిక్కుకుంది.
కారు వరద నీటిలో చిక్కుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక రైతులు వెంటనే స్పందించి ట్రాక్టర్‌ సాయంతో కారును వరద నీటి నుంచి సురక్షితంగా బయటకు లాగారు.
సకాలంలో స్థానికులు స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో కారులోని కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టిన స్థానిక రైతులను పలువురు అభినందించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button