HyderabadPoliticalTelangana

హాస్టల్‌లోకి దూసుకెళ్లిన పోలీస్.. విద్యార్థుల పై లాఠీచార్జ్

హాస్టల్‌లోకి దూసుకెళ్లిన పోలీస్.. విద్యార్థుల పై లాఠీచార్జ్

హాస్టల్‌లోకి దూసుకెళ్లిన పోలీస్.. విద్యార్థుల పై లాఠీచార్జ్

Web desc : పోలీసులు హాస్టల్‌లోకి జొరబడి విద్యార్థుల పై లాఠీచార్జ్ చేసి హాస్టల్ విద్యార్థులను చితక బాదిన సంఘటన పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైసమ్మగూడలో చోటు చేసుకోగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యింది.

బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఇండియా-న్యూజిలాండ్ టి20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఇండియా విజయం అనంతరం మైసమ్మగూడలో హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులు బయటకు వచ్చి సంబరాలు జరుపుకున్నారు.

ఈ తరుణంలో పోలీసులు అక్కడికి వచ్చి విద్యార్థులను చెదరగొట్టారు. రాళ్లు రువ్వారన్న కోపంతో హాస్టల్‌లోకి చొరబడిన పోలీసులు విద్యార్థుల పై లాఠీచార్జ్ చేయగా కొందరు విద్యార్థులకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం.

బాధితులను ఓ ప్రతినిధి సంప్రదించగా, హాస్టల్‌లో పనిచేసే వారి మాటలు విని హాస్టల్‌లోకి జొరబడిన ఇద్దరు పోలీసులు లాఠీలతో తమపై దాడి చేసి చితకబాదారని వాపోయారు. హాస్టల్‌లోకి వెళ్లి విద్యార్థులపై పోలీసులు చితకబాదిన వీడియో వైరల్ కావడం సంచలనంగా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button