HyderabadPoliticalTelangana

రోడ్లపై చెత్త కనిపిస్తే తాట తీస్తానంటూ వార్నింగ్...

రోడ్లపై చెత్త కనిపిస్తే తాట తీస్తానంటూ వార్నింగ్...

రోడ్లపై చెత్త కనిపిస్తే తాట తీస్తానంటూ వార్నింగ్…

టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, సిబ్బందిలో వణుకు పుట్టిస్తున్న లేడీ బాస్..

Web desc : కేర్‌ లెస్‌గా ఉంటే కుదరదు. రోడ్డుపై చెత్త కనిపిస్తే బాగోదు. పని చేస్తున్నందుకు మనకు జీతం ఇస్తున్నారు. అది చాలదని దోచుకుంటామంటే కుదరదంటూ హడలెత్తిస్తున్నారు. నేను కరప్షన్ చేయను. అధికారులను, సిబ్బందిని అవినీతి చేయనివ్వనూ అంటూ ఎక్కడిక్కడ వార్నింగ్‌లు ఇస్తున్నారు ఓ లేడీ బాస్.

ముఖ్యంగా అవినీతికి కేరాఫ్‌గా ఉండే టౌన్‌ ప్లానింగ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా రంగంలోకి దిగారట ఆ ఆఫీసర్. ఇంతకు ఎవరా మహిళా అధికారి? ఆమె పేరు వింటేనే అధికారులు, సిబ్బందిలో ఎందుకు వణుకు పుడుతోంది?

ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటామంటే కుదరదు. చచ్చినట్లు అందరూ పని చేయాల్సిందే. తనతో సహా ఎవరికి మినహాయింపులు లేవంటూ సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్‌ శ్రీజన చూపిస్తున్న దూకుడు సిబ్బందికి కునుకు లేకుండా చేస్తోంది.

క్విక్‌ డెసిషన్స్‌తో షాక్‌లు ఇస్తున్నారు. నగరంలో చెత్త సమస్య తీవ్రంగా ఉందని, చెత్త సమస్య లేకుండా చేయడమే ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని పని చేస్తున్నారు. అయితే రివ్యూలు..లేకపోతే ఫీల్డ్‌ విజిట్లతో ఫుల్‌ బిజీగా గడిపేస్తున్నారు.

రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించొద్దని సిబ్బందికి, అధికారులకు స్ట్రిక్ట్స్‌ ఆర్డర్స్ ఇచ్చేశారు. విధుల్లో ఏ మాత్రం కేర్‌ లెస్‌గా ఉన్నా..చెత్తను తీయకుండా వదిలేసినా కఠిన చర్యలు తప్పవని వార్నింగ్‌లు ఇస్తున్నారు.

నో కరప్షన్..నో నెగ్లిజెన్స్..ఓన్లీ వర్క్ మోడ్‌

మామూలుగా GHMC టౌన్‌ ప్లానింగ్‌ అంటేనే కరప్షన్‌కు కేరాఫ్‌ అన్న ఆరోపణలు ఉండేవి. కానీ సీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌లో అలాంటి పరిస్థితి ఉంటే సహించేదే లేదంటున్నారు కమిషనర్ శ్రీజన.

నో కరప్షన్..నో నెగ్లిజెన్స్..ఓన్లీ వర్క్ మోడ్‌ అంటూ టాప్ టు బాటమ్ అందరికీ ఇచ్చి పడేస్తున్నారు. అవినీతి చేసి వెనకేసుకుని సాధించేదేమీ ఉండదు.. నిజాయితీగా పని చేయండి అంటూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

అవినీతి చేస్తే ఉద్యోగం ఊస్టే..

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగా ఏర్పడింది. సరైన సౌకర్యాలు, ఆఫీసులు కూడా లేవు. అయినా సీఎం రేవంత్ డైరెక్షన్‌లో ఫీల్డ్ విజిట్లు చేస్తూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోతున్నారు CMC కమిషనర్ శ్రీజన. తను పర్యటించిన ఏరియాల్లో రోడ్లపై చెత్త కనిపిస్తే చాలు అక్కడున్న సిబ్బందిపై ఓ రేంజ్‌లో సీరియస్ అవుతున్నారు.

అయితే మామూలుగానే నెమ్మదిగా పని చేయడానికి..అవినీతికి అలవాటు పడిన పలువురు అధికారులు..మేడమ్‌ పేరు ఎత్తితే చాలు హడలెత్తిపోతున్నారట.

నో కరప్షన్..ఎక్కడైనా అవినీతి జరిగినట్లు తన దృష్టికి వస్తే ఉద్యోగం ఊస్టే అంటూ తేల్చి చెబుతున్నారట. దీంతో కమిషనర్ శ్రీజన క్షేత్రస్థాయి పర్యటనకు వస్తున్నారంటే చాలు సిబ్బంది వణికిపోతున్నారట.

ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పారదర్శకమైన, అవినీతిరహిత పాలన అందించడమే లక్ష్యమంటున్నారు CMC కమిషనర్.

ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమస్యలను సాల్వ్‌ చేస్తామని హామీ ఇస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం మీడియా, సోషల్ మీడియా నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను కూడా తీసుకుంటానని చెబుతున్నారు.

ఏప్రిల్ నుంచి సైబరాబాద్‌లో పూర్తి స్థాయిలో సెపరేట్‌గా పాలన మొదలవుతుందని..అప్పటి నుంచి ఇంకా పకడ్బందీగా పనిచేసుకుంటూ పోయేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

ప్రజల కోసం పని చేసేందుకే ఉద్యోగంలో చేరానంటున్న ఆమె..తన పని తాను చేసుకుంటూ పోతానని..ఎట్టి పరిస్థితుల్లో అవినీతికి ఆస్కారం ఇవ్వనని ఒకటికి రెండుసార్లు తేల్చి చెప్తున్నారు. సమస్య చిన్నదా, పెద్దదా అనే తేడా లేకుండా అందరికీ సమ ప్రాధాన్యత ఇవ్వడమే ఎజెండాగా పెట్టుకున్నారు.

పేదల సమస్యల పరిష్కారానికి స్పెషల్‌ ఫోకస్ పెడుతున్నారు. కరోనా టైమ్‌లో ప్రజలకు సేవలందించడం, కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయడం, జల సంరక్షణలో తెలంగాణకు జాతీయ అవార్డులు ఆమె ఉద్యోగ జీవితంలో కీలక మైలురాళ్లుగా నిలిచాయి. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్‌గానూ తనదైన ముద్ర వేశారు.

ఇప్పుడు సీఎంసీలోనూ తన మార్క్ పనితీరుతో..శానిటేషన్, చెత్త సేకరణ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారామె. మొత్తానికి ఆ లేడీ బాస్ తనకు అప్పగించిన బాధ్యతలపై ఇంత పక్కాగా ముందుకు వెళ్తుండటంపై ప్రజల్లో పాజిటివ్ టాక్ వస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button