
తల్లి పేరనున్న భూమిని సమానంగా పంచాలి
- అన్నదమ్ముల సమస్యలోకి పొంగులేటిని, దయాకర్‌రెడ్డిని లాగొద్దు
- తండ్రి పేరనున్న భూమిని కాజేసేందుకు యత్నం
- మీడియా సమావేశంలో కొప్పుల రమేష్ అన్నదమ్ములు
ఖమ్మం, మార్చి 20 . తల్లి పేరనున్న భూమిని ఆమె ఐదుగురు కొడుకులకు సమానంగా పంచాలని వారసులు కోరారు. ఖమ్మంలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో కొప్పుల రమేష్, కొప్పుల నాగేశ్వరరావు, కొప్పుల జనార్దన్, కొప్పుల జైపాల్, కొప్పుల నాగేశ్వరరావు తండ్రి జైపాల్ కోరారు.
ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంకు చెందిన వారు మీడియాతో మాట్లాడుతూ తీర్ధాల రెవెన్యూలోని760 సర్వే నెంబర్‌లో కొప్పుల పేరమ్మ పేరు మీద ఉన్న 4.13 కుంటలు వెుట్ట భూమిని కొప్పుల రామారావు తన భార్య సుధారాణి పేరు మీద, ఎకరం ఒక కుంట మాగాణిని అతని కొడుకు ప్రపుల్లకుమార్ పేరు మీద దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని తెలిపారు.
ఇది తెలుసుకున్న రామారావు తల్లి వీరమ్మ దానిని రద్దు చేయించి, తన ఐదుగురు కొడుకులకు సమానంగా పంచాలని వీలునామా రాసిందని, అఫిడవిట్‌లో పేర్కొందని తెలిపారు.
కొప్పుల పుల్లయ్య పేరు మీద ఉన్న 5 ఎకరాల 32 కుంటల భూమిని అక్రమంగా
రిజిస్రేష్టన్ చేయించుకునేందుకు రామారావు యత్నిస్తున్నాడని ఆరోపించారు.
ఇది అన్నదమ్ముల, పాలెభాగాల సమస్య అని అన్నారు. ఇందులోకి అనవసరంగా మంత్రి పొంగులేటిని, ఆయన
క్యాంప్ ఆఫీస్ ఇన్‌ఛార్జి దయాకర్‌రెడ్డిని లాగుతున్నారని, ఇది సరి కాదని పేర్కొన్నారు.
తమ సమస్యకు, పొంగులేటికి, దయాకర్‌రెడ్డికి సంబంధం లేదని స్పష్టం చేశారు. మంత్రి అంటే గిట్టని వారు కొప్పుల రామారావు, జగదీష్‌తోటి రాజకీయంగా పూయాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
తమ సమస్యను తామే పరిష్కరించకుంటామన్నారు. దీనికి రాజకీయం పూయవద్దని సూచించారు.




