
అర్ధరాత్రి కాంగ్రెస్ కీలక నేతపై పెట్రోల్ దాడి…
Web desc : అంతర్గత కుమ్ములాటలతో ఇప్పటికే సతమతమయ్యే వరంగల్ రాజకీయాల్లో ఘోరం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్, 14వ డివిజన్ మాజీ అధ్యక్షుడు అడుప మహేష్‌ను టార్గెట్‌గా ఈ దాడి జరిగింది. శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అడుప మహేష్ తన బైక్‌పై ఎస్‌ఆర్ నగర్ నుంచి కోటి లింగాలగుడి మీదుగా ఎన్టీఆర్ నగర్‌లోని తన ఇంటి వెళ్తున్నాడు.
మార్గమధ్యలో కాపుకాచిన దుండగులు అతడిని అడ్డుకున్నారు. క్షణాల వ్యవధిలోనే తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను మహేష్‌పై పోసి నిప్పంటించి అక్కడి నుంచి చెక్కేశారు. అయితే, ఒంటికి మంటలు అంటుకోవడంతో తీవ్ర తీవ్ర భయాందోళనకు గురైన మహేష్, అదే స్థితిలో పరుగులు తీస్తూ ఎన్టీఆర్ నగర్‌లోని స్థానికుల వద్దకు చేరుకున్నారు.
ముఖం, మెడ, ఛాతీ భాగాల్లో తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న ఆయనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.




