Andhra PradeshPolitical

నకిలీ కానిస్టేబుల్ హల్‌చల్...

నకిలీ కానిస్టేబుల్ హల్‌చల్...

నకిలీ కానిస్టేబుల్ హల్‌చల్…

మహిళతో హోం స్టే గదిలోకి వెళ్లిన కానిస్టేబుల్.. అనుమానం వచ్చి…!

Web desc : తిరుపతి జిల్లా పాకాల పరిధి చింతలచేను ప్రాంతంలో నకిలీ కానిస్టేబుల్ హల్‌చల్ చేశాడు. పోలీస్ యూనిఫాం ధరించి, నకిలీ గుర్తింపు కార్డు చూపించి ఒక హోమ్‌ స్టే మేనేజర్‌ను బెదిరింపులకు గురిచేశారు.

శనివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఒక మహిళతో కలిసి సదరు వ్యక్తి ఆ హోమ్‌ స్టేలో గదిని అద్దెకు తీసుకున్నాడు.

అయితే ఉదయం 6 గంటలవుతున్నా గది తలుపులు ఎంతకీ తెరవకపోవడంతో హోమ్‌ స్టే సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో వారు వెంటనే అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తిని విచారించారు. అయితే అతను నకిలీ పోలీస్ అని తేలింది.

నిందితుడు గుంటూరుకు చెందిన దాసరి కార్తీక్‌గా పోలీసులు గుర్తించారు. అతని వద్ద ఉన్న నకిలీ పోలీస్ ఐడీ కార్డుతో పాటు కానిస్టేబుల్ యూనిఫాంను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button