Andhra Pradesh

హైటెక్ వ్యభిచారం.. వాట్సప్‌లో అందమైన అమ్మాయిలు ఫొటోలు పంపి..!

హైటెక్ వ్యభిచారం.. వాట్సప్‌లో అందమైన అమ్మాయిలు ఫొటోలు పంపి..!

హైటెక్ వ్యభిచారం.. వాట్సప్‌లో అందమైన అమ్మాయిలు ఫొటోలు పంపి..!

Social media viral : అందమైన అమ్మాయిలు కావాలంటే మా గ్రూప్‌లో జాయిన్ అవ్వమని టెలిగ్రామ్.. ఇన్‌స్టాలో నోటిఫికేషన్ వస్తుంది. చేరిన వెంటనే అమ్మాయిల ఫోటోలు విత్ రేట్ పెడతారు.రూమ్ బుకింగ్ కూడా మాదే అంటూ మెసేజ్ పెడతారు. ఇలా నెల్లూరులో హైటెక్ వ్యభిచారం జరుగుతోంది. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు పదుల సంఖ్యలో విటులతోపాటు నిర్వాహకులను పట్టుకున్నారు.

ఇవాళ, రేపు స్మార్ట్ ఫోన్ చేయని పని అంటూ ఏదీ లేదు. అలాంటి స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించి ఏకంగా హైటెక్ వ్యభిచారం చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. వాట్సప్‌లో అందమైన అమ్మాయిలు ఫొటోలు పెడుతున్నారు..

కక్కుర్తి పడి మెసేజ్ చేస్తే.. వాళ్లే లాడ్జి బుక్ చేసి.. తాము చెప్పిన లాడ్జిలో ఫలానా రూమ్‌కి వెళ్లమని చెబుతారు. ఇలా నెల్లూరులోని పలు లాడ్జిలలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతోంది. బాలాజీ నగర్, చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొన్ని లాడ్జిలు కేవలం వ్యభిచారం కోసమే వినియోగిస్తున్నారు.

ఇటీవల టౌన్ ASP దీక్ష చేసిన దాడుల్లో సుమారు 30 మంది మహిళలు, విటులు, స్టూడెంట్స్ దొరికిపోవడం సంచలనం కలిగిస్తోంది. చిన్న బజార్ పీఎస్ పరిధిలో ఒకే వ్యక్తి మూడు లాడ్జిలను మెయింటేనెన్స్‌కు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

బయట ప్రాంతాల నుంచి యువతులను తీసుకు రావడంతో పాటు స్థానికంగా ఉండే మహిళలతో ఈ నీచపు దందా చేయిస్తున్నారు. పీఎస్‌కె గ్రాండ్ ఆర్గనైజర్ పేరుతొ నేరుగా ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టేశారు. ఇందులో నాలుగు లాడ్జీలుంటాయి.

కొత్త అమ్మాయిలు వస్తే రేటెంతో.. అమ్మాయిల ఫొటోలతో సహా పెట్టేస్తారు. ఇలా కొద్ది రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ చీకటి వ్యాపారం జరుగుతోంది. దీనిపై పక్కా సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. ఆ నాలుగు లాడ్జి పరిసర ప్రాంతాలలో మఫ్టీలో కానిస్టేబుల్స్‌ను ఉంచారు.

ఈ క్రమంలో రోజు ఆయా లాడ్జిలలో వ్యభిచారం జరుగుతుందని నిర్ధారణకు వచ్చిన అనంతరం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 30 మంది మహిళలు విటులను అరెస్టు చేశారు.

నలుగురు కాలేజ్ స్టూడెంట్స్ ఓ మహిళతో రూమ్‌లో ఉండటాన్ని గ్రహించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. గతంలో నెల్లూరు టౌన్ డీఎస్పీ ఆఫీస్ సమీపంలో ఓ వ్యభిచార గృహం పై పోలీసులు దాడులు చేశారు.

అనంతరం వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీవీనగర్.. మాగుంట లేఔట్ లోని పలు స్పా సెంటర్లో సైతం దాడులు నిర్వహించి వ్యభిచారం చేస్తున్న యువతులను అదుపులోకి తీసుకున్నారు.

కానీ నిర్వాహకులను మాత్రం వదిలేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. నిప్పో సెంటర్ సమీపంలోని ఓ స్పా సెంటర్‌తో పాటు.. చింతా రెడ్డిపాలెం జంక్షన్ సమీపంలో ఉండే మరో స్పా సెంటర్‌లో కూడా ఇదే తరహా వ్యభిచారం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button