HyderabadPoliticalTelangana

నాలాలో పడిపోయిన డెలివరీ బాయ్

నాలాలో పడిపోయిన డెలివరీ బాయ్

నాలాలో పడిపోయిన డెలివరీ బాయ్

హైదరాబాద్ లో 2026 అక్టోబర్ 30 (శుక్రవారం) సాయంత్రం కురిసిన వర్షానికి నాలాలు, కాలువలు పొంగిపొర్లాయి. మాదాపూర్ ఏరియాలో ఉధృతంగా ప్రవహిస్తున్న నాలాలో డెలివరీ బాయ్ పడిపోయిన దృశ్యాలు తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. వివరాల్లోకి వెళ్తే.. జెప్టో (Zepto) సంస్థలో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఘంటసాల అర్జున్ కుమార్ (46) తన బైక్‌పై వెళ్తుండగా మాదాపూర్ విటల్ రావు నగర్ దగ్గర జరిగింది ఈ ప్రమాదం.

రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీటి హోరుకు అదుపుతప్పి పక్కనే ఉన్న నాలాలో పడిపోయారు. ​సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి అర్జున్ కుమార్‌ను సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారు. ​

అయితే, నాలాలో నీటి ప్రవాహం అత్యంత ఉధృతంగా ఉండటంతో కొట్టుకుపోయిన మోటార్ సైకిల్‌ను ఇంకా బయటకు తీయలేకపోయారు. వర్షాలు, వరద ఉధృతి నేపథ్యంలో పోలీసు బృందాలు ఆ ప్రాంతంలో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాయి. వాహనదారులు, బాటసారులు అప్రమత్తంగా ఉండాలని, నీరు ఎక్కువగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button