
చింతకానిలో గంజాయి కలకలం…. పోలీసుల పెట్రోలింగ్‌లో ఇద్దరు పట్టివేత…!
నరసింహపురం సమీపంలో గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఇద్దరు యువకులు…!
గంజాయి విక్రయించినట్లు ఆరోపణలు.. పరారీలో పెనుగొండ సాయి…!
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.
చింతకాని మండల పరిధిలోని నరసింహపురం గ్రామ సమీపంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులు పట్టుబడ్డారు పెట్రోలింగ్‌లో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న యువకులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారు అగ్రహారం కాలనీకి చెందిన వినయ్ విజయ్‌లు గాంధీనగర్ కాలనీకి చెందిన పెనుగొండ సాయి వద్ద గంజాయి కొనుగోలు చేసి సేవిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం గంజాయి విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పెనుగొండ సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిసింది ఈ ఘటనపై చింతకాని ఎస్సై జి నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు గంజాయి సరఫరా వెనుక ఉన్న ఇతర వ్యక్తుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు…..




