
భార్యను కత్తితో పొడిచిన భర్త..
Web desc : భార్యా భర్తల కొట్లాటలో క్షనికావేశంలో భార్యను భర్త కత్తితో పొడిచిన ఘటన జడ్చర్ల మున్సిపాలి గౌరీశంకర్ కాలనీలో చోటుచేసుకుంది.
పిచ్చకుంట్ల మల్లేష్, లలిత భార్యాభర్తలు.మున్సిపాలిటీలోని గౌరీ శంకర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య తరచుగా తగాదాలు జరిగేవి.
ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి భార్యాభర్తల మల్లేష్ లలితల మధ్య మాట మాట పెరగడంతో భర్త మల్లేష్ ఇంట్లో కూరగాయలు కట్ చేయడానికి వాడే కత్తిని తీసుకొని క్షణిక ఆవేశంలో భార్య లలితను పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వారి ఇంటి వద్ద చేరుకోవడంతో మల్లేష్ అక్కడి నుండి పరారయ్యాడు.
స్థానికులు 108 సాయంతో గాయపడిన లలితను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లలిత ఆరోగ్య పరిస్థితి పై స్పష్టత రావాల్సి ఉంది.



