KarimnagarPoliticalTelangana

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు… విచారణకు రావాల్సిందే

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు… విచారణకు రావాల్సిందే

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు… విచారణకు రావాల్సిందే

కరీంనగర్ జిల్లా : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్‌ 4న ఉదయం 11.30 గంటలకు విచారణకు రావాలని చెప్పింది.

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గొడవ కేసులో సీఐడీ ఈ నోటీసులు ఇచ్చింది. ఈ ఘటన విచారణలో మొత్తం కలిపి 16 మంది బీఆర్ఎస్ నాయకులకు సీఐడీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

కాగా, గతంలో సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తున్న కౌశిక్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఫ్యామిలీతో కలిసి వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డ కౌశిక్‌ రెడ్డి హుజూరాబాద్‌ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

ఆ సమయంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, కరీంనగర్‌ సీపీ గురించి మతపరమైన కామెంట్స్‌ చేశారు. ఆ వ్యాఖ్యలను ఐపీఎస్‌ అధికారుల సంఘం ఖండించింది. క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button