KhammamPoliticalTelangana

నాగులవంచ గ్రామం లో బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతి వేడుకలు

నాగులవంచ గ్రామం లో బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతి వేడుకలు

నాగులవంచ గ్రామం లో బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతి వేడుకలు.

చింతకాని మండల ఎంఆర్పిఎస్ నాయకులు ఆధ్వర్యంలో….

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిర్లాపురం గ్రామ సర్పంచ్ చాపలమడుగు వీరబాబు…

సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.

చింతకాని మండల పరిధిలో నాగులవంచ గ్రామంలో జగ్గం హోటల్ సెంటర్లో ఉన్న బాబు జగ్జీవన్ రావ్ గారి కాంస్య విగ్రహానికి పూలదండతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిర్లాపురం గ్రామ సర్పంచ్ చాపలమడుగు వీరబాబు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ..ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి, ఆశయాలను స్మరించుకుంటూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం చాలా నేటి సమాజంలో ఒక గొప్ప సంఘ సంస్కర్త,భారత మాజీ ఉప ప్రధాని, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మరియు దళిత నాయకుడు బాబు జగ్జీవన్ రామ్119వ జయంతిని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5న ఘనంగా జరుపుకుంటారు.

“బాబూజీ”గా ప్రసిద్ధి చెందిన ఆయన, అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం పోరాడారు. ఆయన 1908 ఏప్రిల్ 5న బీహార్‌లో జన్మించారు.  బాబు జగ్జీవన్ రామ్ ప్రత్యేకత.. భారత చరిత్రలో అత్యధిక కాలం (30 సంవత్సరాలకు పైగా) కేంద్ర మంత్రిగా పనిచేసిన రికార్డు ఆయన పేరిట ఉంది.

వారి సేవలు భారత ఉప ప్రధానిగా, రక్షణ మంత్రిగా (1971 యుద్ధ సమయంలో), వ్యవసాయ మంత్రిగా (హరిత విప్లవం సమయంలో) కీలక పాత్ర పోషించారు.వారి ఆశయం కుల రహిత సమాజ స్థాపన మరియు అంటరానితనం నిర్మూలనకు జీవితాంతం కృషి, వారి సేవలు ఎన్నటికీ మరువ లేనిది. ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో చింతకాని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు చిర్ర ఉపేందర్, ఎమ్మార్పీఎస్ నాయకులు పగిడిపల్లి రవీంద్రబాబు, కూరాకుల గోపయ్య,గంధం జగజీవన్ రావు, కొల్లి బాబు, గుండ్ల రాంబాబు, గంధం వెంకటేశ్వర్లు, పడిశాల సాయి, పడిశాల కృష్ణ, పడిశాల భార్గవ్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button