
పాల్వంచలో ఆరవ తరగతి విద్యార్థి ఆత్మ*హత్య…
పాల్వంచ పట్టణంలోని వెంగళరావు కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆరవ తరగతి చదువుతున్న ఓ బాలుడు ఇంట్లో ఫ్యాన్ కి ఉరేసుకుని మృతి చెందిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల ప్రకారం.. వెంగళరావు కాలనీకి చెందిన భూక్యా మహేందర్ (12) అనే బాలుడు స్థానికంగా ఉన్న డి.ఏ.వి పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరూ గమనించని సమయంలో ఉరేసుకున్నట్లు తెలుస్తోంది.
కొంతసేపటికి గమనించిన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే బాలుడిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించినట్లు సమాచారం.
చిన్న వయసులోనే బాలుడు మృతి చెందడంతో వెంగళరావు కాలనీలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. బాలుడి మృతికి గల అసలు కారణాలు ఏమిటన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.




