
TVK విక్టరీ.. విజయ్ ఇంటికి త్రిష..వీడియో వైరల్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమిళగ వెట్రి కజగం (TVK) సృష్టిస్తున్న ప్రభంజనం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ముఖ్యంగా విజయ్ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతుండటంతో ఆయన నివాసం వద్ద కోలాహలం నెలకొంది. ఇప్పటికే టీవీకే 100 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉండటంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.
ఈ క్రమంలో టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష నేరుగా విజయ్ ఇంటికి వెళ్లి అభినందనలు తెలపడం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఈరోజు ఉదయం త్రిష తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. విజయ్ పార్టీ భారీ మెజారిటీతో గెలవాలని ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.
త్రిష పుట్టినరోజు (మే 4) నాడే ఈ ఫలితాలు రావడం, ఆమె కోరుకున్న విధంగానే విజయ్ పార్టీ ముందంజలో ఉండటంతో ఆమె రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. గతంలో వీరిద్దరూ కలిసి అనేక బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించడం (గిల్లి, తిరుపాచి, కురువి, లియో) తో వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యం తెలిసిందే.




