
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆత్మీయ సభను విజయవంతం చేయండి
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, నాగండ్ల దీపక్ చౌదరి, పువ్వాళ్ళ దుర్గాప్రసాద్
సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన జరిగిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పదవి చేపట్టి 40 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా రేపు ది 13-05-2026 న సాయంత్రం 05.00 గంటలకు ఖమ్మం నగరం లోని ఎస్ ఆర్ అండ్ బీ జీ ఎన్ ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆత్మీయ సభను విజయవంతం చేయాలని జిల్లా శ్రేణులనుకోరారు.అదే విధంగా వారు అభివృద్ధికి మారు పేరు అని కొనియాడారు.
అనంతరం నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి మాట్లాడుతూ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ జీవితంలో ప్రజాసేవ,అభివృద్ధి , రైతు సంక్షేమం కోసం కృషి చేశారని వారి ఆత్మీయ సభను విజయవంతం చేయాలని నగర కాంగ్రెస్ శ్రేణులను కోరారు.
అనంతరం సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ దురంధరుడని,40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అభివృద్దే ధ్యేయంగా పనిచేసిన అలుపెరుగని యోధుడని కావున ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.
అనంతరం జిల్లా రైతు కన్వీనర్ నల్లమల వేంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఖాదర్ బాబా లు మాట్లాడుతూ రేపటి తుమ్మల నాగేశ్వరరావు ఆత్మీయ సభను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఏ ఐ సి సి సేవాదళ్ కో ఆర్డినేటర్ చోటా బాబా, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భానోత్ బాలాజీ నాయక్,జిల్లా ఐ యన్ టి యు సి అధ్యక్షులు కొత్తా సీతారాములు, జిల్లా సేవాదళ్ అద్యక్షులు సయ్యద్ గౌస్, జిల్లా ఎస్ సి సెల్ అద్యక్షులు బొడ్డు బొందయ్య, జిల్లా మైనారిటీ అద్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మూడుముంతల గంగరాజు యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు యర్రం బాలగంగాధర్ తిలక్, మాజీ కౌన్సిలర్ నగర కాంగ్రెస్ కమిటి సభ్యులు పాలకుర్తి నాగేశ్వరరావు, నగర ఓబీసీ సెల్ అద్యక్షులు బాణాల లక్ష్మణ్, నగర కాంగ్రెస్ కమిటి సభ్యులు కోసూరి ప్రసాద్, సంపటం నరసింహారావు, నాగటి చంద్రశేఖర్ , కోనేటి నారాయణ, నగర కాంగ్రెస్ నాయకులు ప్రతిభారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.




