EducationHyderabadNotificationPoliticalTelangana

నిరుద్యోగులకు ఇక కొలువుల జాతరే.. భారీగా పెరిగిన పోలీసు ఉద్యోగాల సంఖ్య

నిరుద్యోగులకు ఇక కొలువుల జాతరే.. భారీగా పెరిగిన పోలీసు ఉద్యోగాల సంఖ్య

నిరుద్యోగులకు ఇక కొలువుల జాతరే.. భారీగా పెరిగిన పోలీసు ఉద్యోగాల సంఖ్య

Web desc : రాష్ట్రంలో కొలువుల జాతర మళ్లీ మొదలైంది. పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే తీపి కబురు అందించింది.

రాష్ట్రంలో భారీ సంఖ్యలో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో (Police Department) పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. అయితే, ఇటీలలే 5 వేల ఉద్యోగాలకు అనుమతి లభించగా.. తాజాగా మరో 2,437 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మొత్తం 7,437 పోస్టులలో వివిధ విభాగాలకు చెందిన ఖాళీలు ఉన్నాయి. అందులో ఫైర్ డిపార్ట్‌మెంట్ 790 పోస్టులు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 1,424 పోస్టులు, జైళ్ల శాఖలో 223 పోస్టులు, పోలీస్ శాఖలోని ఇతర విభాగాల్లో 5 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు. త్వరలోనే అధికారిక నోటిఫికేషన్లు..

అయితే, ఆయా పోస్టులకు ఆర్థిక శాఖ (Finance Department) నుంచి ఉద్యోగాల భర్తీకి పూర్తిస్థాయిలో అనుమతులు రావడంతో, నోటిఫికేషన్ల విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ పోస్టులకు సంబంధించిన అధికారిక రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) వెల్లడించింది.

అర్హత కలిగిన అభ్యర్థులు సిలబస్, వయోపరిమితి, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వాలని సూచించింది. కాగా, ఇటీవలే పోలీసు ఉద్యోగాల సంఖ్యను పెంచాలంటూ దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగ యువత పలుమార్లు రోడ్డెక్కి నిరసన తెలిపారు. కేవలం 5 వేల పోస్టులను మాత్రమే ప్రకటించడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం తిరిగి 2,437 పోస్టులను పెంచడం అత్యంత ప్రధాన్యతను సంతరించుకుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button