
వైర్లు తెగి కిందపడిన లిప్టు.. బీఆర్ఎస్ నాయకులకు ప్రమాదం
హైదరాబాద్‌లోని మణికొండ డాలర్ హిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది. స్థానిక అపార్డు మెంటులో ఓ లిఫ్ట్ వైర్లు తెగి కిందపడిన దారుణ సంఘటన జరిగింది. అయితే డాలర్ హిల్స్‌లోని స్ధానిక అపార్డుమెంటులో అందరూ కలిసి కిందికి దిగే సమయంలో జరిగింది. లిప్ట్‌లో మోత్తం 6 గురు వ్యక్తులు ఉన్నారు.
లిఫ్ట్‌లో ప్రయాణిస్తున్న 6 మంది మోత్తం బీఆర్ఎస్ నాయకులుగా గుర్తించారు. అయితే బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ అనంతరం లిఫ్టులో కిందికి దిగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
5వ అంతస్తులో.. దీంతో 6 గురిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారిలో ఇద్దరిని అపోలో ఆసుపత్రికి తరలించారు.
అనంతరం ఆసుపత్రిలోకి వెల్లిన వారికి కాళ్లు విరిగి నట్టుగా అక్కడి అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భయాందోళనకు గురిచేసిన ఈ సంఘటనతో అక్కడి బీఆర్ఎస్ నాయకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
డాలర్ హిల్స్‌లోని ఓ అపార్ట్మెంట్లో 5వ అంతస్తులో బిఆర్ఎస్ పార్టి మీటింగ్ జరిగింది. దీంతో మీటిగ్ ముగిసినంతరం నాయకులంతా కలిసి లిఫ్ట్‌లో కిందకు దిగుతున్న సమయంలో వైర్లు తెగి ఈ ఘటన జరిగింది.




