PoliticalTelanganaWarangal

వరంగల్ హైవేపై ప్రమాదంలో నుజ్జునుజ్జైన కారు…

వరంగల్ హైవేపై ప్రమాదంలో నుజ్జునుజ్జైన కారు…

వరంగల్ హైవేపై ప్రమాదంలో నుజ్జునుజ్జైన కారు…

నర్సంపేట నుంచి వరంగల్‌కు వెళ్లే ప్రధాన రహదారి పై మంగళవారం వేకువజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

మక్కల లోడుతో వెళ్తున్న లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

నర్సంపేట నుంచి మక్కజొన్న లోడ్‌తో వరంగల్ వైపుగా లారీ వెళ్తుండగా, కాశీబుగ్గకు చెందిన వెల్దండి వరుణ్ (34) నర్సంపేట వైపుగా కారులో వెళ్తున్నాడు. సరిగ్గా దుగ్గొండి మండలం గిర్నిబావి సెంటర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో వరుణ్‌కు తీవ్ర గాయాలు కాగా, కారు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button