
లారీని ఢీకొట్టిన బైక్, హెడ్ కానిస్టేబుల్ మృతి.. హోంగార్డుకు గాయాలు
ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో హెడ్ కానిస్టేబుల్ చనిపోగా, హోం గార్డుకు గాయాలయ్యాయి.
ఈ ప్రమాదం కామారెడ్డి జిల్లా పెద్దకొడపగల్ సమీపంలో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బోధన్ కు చెందిన రాజ్ కుమార్ (45) మద్నూర్ లో నివాసం ఉంటూ పిట్లం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు.
మంగళవారం రాత్రి హోంగార్డు మధుతో కలిసి బైక్ పై మద్నూర్ నుంచి పిట్నం వస్తున్నారు. పెద్ద కొడప్గల్సమీపంలోకి రాగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో హెడ్‌కానిస్టేబుల్ రాజ్కుమార్అక్కడికక్కడే చనిపోగా, హోం గార్డు మధుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన మధును హాస్పిటల్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పెద్దకొడప్ గల్ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు.




