HanumakondaPoliticalTelangana

పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి

పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి

పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి

మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం తరపున ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నన్నీ ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా ఇచ్చి తీరుతామని అన్నారు. దీంతో పక్కన ఉన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి కలగజేసుకొని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై మండిపడ్డారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి అబద్ధాలు చెప్తున్నారంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ కౌశిక్ రెడ్డి అప్పుల పేరుతో కాంగ్రెస్ తప్పించుకునే డ్రామాలు ఆపాలని పొంగులేటితో సభా వేదికపైనే కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సర్కార్‌ అలవికాని హామీలిచ్చి అమలు చేయలేక గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ కాలమెల్లదీస్తుందని ప్రత్యేకించి చెప్పనసరం లేదు. కాంగ్రెస్ సర్కార్‌ పనితీరు ఎలా ఉందో తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చేసిన కామెంట్స్ మరోసారి చెప్పకనే చెబుతున్నాయి.

కమలాపూర్ మండలంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button