HyderabadMedchalPoliticalTelangana

తహసీల్దార్‌ సుచరిత ఇల్లు సహా మూడు ప్రాంతాల్లో సోదాలు

తహసీల్దార్‌ సుచరిత ఇల్లు సహా మూడు ప్రాంతాల్లో సోదాలు

తహసీల్దార్‌ సుచరిత ఇల్లు సహా మూడు ప్రాంతాల్లో సోదాలు

web desc : హైదరాబాద్‌: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్‌ తహసీల్దార్‌గా పనిచేసి.. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న తుమ్మకొమ్మ సుచరిత అక్రమార్జనపై ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. గురువారం ఏక కాలంలో ఆమె నివాసంతోపాటు బంధువులు, బినామీలు, ఇతర అనుచరులకు చెందిన మరో మూడు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో స్థిరాస్తులు, బంగారం, వజ్రాలు, నగదు కలిపి మొత్తం రూ.5 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్టు ఏసీబీ సెంట్రల్‌ జోన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సింధుశర్మ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు అందిన సమాచారం మేరకు సుచరితపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే సోదాల్లో పట్టుబడిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.50 కోట్లకు పైగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

నగదు, నగలు, స్థిరాస్తులు ఇలా… ఏసీబీ అధికారులు గురువారం నాటి సోదాల్లో సుచరితకు చెందిన పలు ఆస్తులను గుర్తించారు. వాటిలో సిద్దిపేట జిల్లా మార్కూక్‌ మండలం దామరకుంటలో 2 ఎకరాల 17 గుంటల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో 3 ఫ్లాట్లు, కీసర, ఖానామెట్‌ ప్రాంతాల్లో రెండు నివాస స్థలాలు, రూ.12 లక్షల నగదు,

వోక్స్‌వ్యాగన్‌ కారు, హ్యుందాయ్‌ క్రెటాకారు, రూ.1.20 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు, బ్యాంకు ఖాతాల్లో రూ.38 లక్షల నిల్వలు గుర్తించినట్టు ఏసీబీ అధికారులు పేర్కొ న్నారు. సోదాల్లో ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల మొత్తం విలువ రూ.5,05, 52,465గా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

ఇప్పటికే లంచం కేసులో అరెస్టు : శామీర్‌పేట్‌ మండలం అలియాబాద్‌ గ్రామంలోని వివిధ సర్వే నంబర్లలోని 30 ఎకరాల భూమిని వ్యవసాయేతర భూ మిగా మార్చాలంటూ కొందరు రైతులు దరఖాస్తు చేసుకు న్నారు. శామీర్‌పేట్‌ తహసీల్దార్‌ పనిచేసిన సమయంలో సుచరిత ఇందుకోసం ఎకరాకు రూ.లక్ష చొప్పున రూ.30 లక్షలు లంచంగా డిమాండ్‌ చేశారు.

రైతులు రిక్వెస్ట్‌ చేయడంతో వాయిదాల్లో డబ్బు ఇవ్వాలని దాని ప్రకారమే వ్యవసా యేతర భూమిగా మారుస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత బాధిత రైతులు ఏసీబీని ఆశ్రయించారు. మధ్యవర్తి ద్వారా మొదటి విడతగా రూ.2 లక్షలు తీసుకుంటుండగా మే 26న సుచరితను ఏసీబీ రెడ్‌ హ్యాండెడ్‌గా అరెస్ట్‌ చేసింది. ఈ కేసులో సుచరిత ప్రస్తుతం చంచల్‌గూడ మహిళా జైలులో జ్యుడీషి యల్‌ రిమాండ్‌లో ఉన్నారు. అక్రమార్జనపై సమాచారంతో ఏసీబీ అధికారులు తాజాగా మరో కేసు నమోదు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button