PoliticalTelangana

రైలుకింద పడి దంపతులు ఆత్మ*హత్య

రైలుకింద పడి దంపతులు ఆత్మ*హత్య

రైలుకింద పడి దంపతులు ఆత్మ*హత్య

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో విషాదం నెలకొంది. ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపాయిపేట గ్రామానికి చెందిన రవికుమార్ (32), శిరీష్ (28) భార్యాభర్తలు.

జీవనోపాధి కోసం కొంతకాలం కింద హైదరాబాద్‌కు వచ్చిన వీరు హయత్‌నగర్ సమీపంలోని కుంట్లూరులో నివాసం ఉంటున్నారు.

అయితే గురువారం రాత్రి వీరిద్దరూ బీబీనగర్ రైల్వే మార్గంలోని ఎన్‌ఎఫ్‌సీ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కొంతకాలంగా దంపతులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమా? మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button