HyderabadPoliticalTelangana

కేటీఆర్, హరీశ్, కవిత సైడ్ యాక్టర్లు... అద్దంకి దయాకర్

కేటీఆర్, హరీశ్, కవిత సైడ్ యాక్టర్లు... అద్దంకి దయాకర్

కేటీఆర్, హరీశ్, కవిత సైడ్ యాక్టర్లు… అద్దంకి దయాకర్

web desc : రాష్ట్రంలోని పలు ప్రధాన సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రావాలని కేసీఆర్ ను ఆహ్వానించేందుకు విప్ అద్దంకి దయాకర్ స్వయంగా ఫోన్ చేశారు. కాని ఆయన ఫోన్ కు కేసీఆర్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. గురువారం సీఎల్పీలో మరో విప్ వేముల వీరేశం, ఎమ్మెల్యే జయ్‌వీర్ రెడ్డితో కలిసి అద్దంకి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అద్దంకి మీడియా ప్రతినిధుల సమక్షంలోనే కేసీఆర్ కు ఫోన్ చేశారు. కాని నో రెస్పాన్స్ వచ్చింది. అంతకు ముందు హరీశ్ రావు పలువురు మంత్రులకు ఫోన్ చేస్తే ..వారి నుంచి రెస్పాన్స్ రాలేదు. దీనికి కౌంటర్ గానే అద్దంకి కూడా కేసీఆర్ కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అద్దంకి మీడియాతో మాట్లాడుతూ.. అధికారిక కార్యక్రమాలకు రావాలని మా మంత్రులు వెళ్లి కేసీఆర్ ను ఆహ్వానించినా ఆయన రాలేదు.

జీతం తీసుకోవడం కోసం మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడు. రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము లేకనే కేసీఆర్ ఇంట్లోనే ఉంటున్నాడని అద్దంకి విమర్శించారు. తెలంగాణ చరిత్రలో హీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు కేసీఆర్ బయటకు రావాలని డిమాండ్ చేశారు.

కేటీఆర్, హరీశ్, కవిత సైడ్ యాక్టర్లు అని అద్దంకి ఆరోపించారు. కేటీఆర్, హరీశ్​ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నారని..తమ లక్ష్యం కేటీఆర్, హరీశ్​కాదని తెలిపారు. మరో విప్ వేముల వీరేశం మాట్లాడుతూ..కేటీఆర్, హరీశ్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ లు ఓ డ్రామా సృష్టించారని ఆరోపించారు.

సీఎం రేవంత్ సవాల్ ను స్వీకరించే దమ్ములేక, కేసీఆర్ ను అసెంబ్లీకి తీసుకువచ్చే ముఖం లేక..వీళ్లు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు సాధారణమని.. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భార్య బదిలీని రాజకీయం చేస్తే ఎలా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి మాట్లాడుతూ…గత పార్లమెంట్ ఎన్నికల్లో దళితుల ఓట్ల కోసం బీఆర్ఎస్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ను బాణంలా గురిపెట్టిందని చెప్పారు. అయితే అది కలిసిరాలేదని, కేసీఆర్ మెప్పు కోసమే ప్రవీణ్ కుమార్ ప్రభుత్వపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో ప్రవీణ్ కుమార్ గురుకులాల కార్యదర్శిగా ఉండి 48 కోట్ల రూపాయల టెండర్లను నిర్వహించారని, మరి అప్పుడు ఆయన ఎన్ని కమీషన్లు తీసుకున్నాడని ప్రశ్నించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button