
రూ. 1.50 కోట్లతో నిర్మిస్తున్న కొత్తపల్లి బ్రిడ్జి ని పరిశీలించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
చిరకాల వాంఛను నెరవేర్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తుల కృతజ్ఞతలు
ఏ నాయకుడు చేయని పనులు చేయడమే నా ప్రధాన లక్ష్యం
బజార్ హత్నూర్ మండలంలోని గిర్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల మారుమూల ప్రాంతం కొత్తపల్లి గ్రామస్తుల చిరకాల వాంఛగా ఉన్న బ్రిడ్జి సమస్యను స్వాతంత్రం వచ్చిన తర్వాత బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తీర్చారు. ఈ సందర్భంగా రూ. 1.50 కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తో కలిసి పరిశీలించారు. గ్రామస్తులు డప్పులతో ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ… దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు అయిన మా గ్రామానికి మాత్రం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కృషి ఫలితంగా ఈరోజు స్వాతంత్ర్యం వచ్చిందని తెలుపుతూ భావోద్వేగానికి గురయ్యారు.
ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. ఎందరో ఎమ్మెల్యేలు వచ్చిన తీర్చని కొత్తపల్లి గ్రామస్తుల కష్టాన్ని తీర్చడం ఆనందంగా ఉందన్నారు. నియోజకవర్గంలో ఎవరు చేయని పనులను, కష్టాలను తీర్చడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో అధికారులు, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.




