
సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన సర్పంచ్ షేక్ సిద్దిక్
సికే న్యూస్ ప్రతినిధి రఘునాథపాలెం: మండల కేంద్రం లోని పువ్వాడ నగర్ గ్రామం లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు గారి దీవెనలతో పువ్వాడ నగర్ నగర్ గ్రామానికి విస్తృతంగా రోడ్లు మంజూరు అయ్యాయి. ఈ సందర్బంగా ఒకటో వార్డులో సీసీ రోడ్లకు కొబ్బరికాయ కొట్టి రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా సర్పంచ్ షేక్ సిద్దిక్ గారు మాట్లాడుతు రానున్న కాలం లో మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు గారు దీవెనలతో గ్రామం అంత సీసీ రోడ్లు నిర్మిస్తాం అని తెలిపారు.ఈ కార్యక్రమం లో వార్డ్ మెంబెర్స్ కొమ్ము రాంబాబు, శ్రీదేవి, గ్రామ పెద్దలు వడ్లకుంట శివ, కర్నె రాములు, నూతన్ ప్రసాద్, ఇస్మాయిల్, జరీన, జనార్దన్,సూరబోయిన వీరన్న, తదితరులు పాల్గొన్నారు.




