KhammamPoliticalsuryapetaTelangana

TGSRTC బస్సులో మహిళకు అస్వస్థత.. సకాలంలో స్పందించిన బస్ డ్రైవర్

TGSRTC బస్సులో మహిళకు అస్వస్థత.. సకాలంలో స్పందించిన బస్ డ్రైవర్

TGSRTC బస్సులో మహిళకు అస్వస్థత.. సకాలంలో స్పందించిన బస్ డ్రైవర్

కోదాడ డిపో బస్సు.. ఖమ్మం బస్టాండ్ కు బయలు దేరింది.. దాదాపు 120 మంది ప్రయాణికులు బస్సు ఎక్కారు.. కాలు పెట్టే ప్లేస్ లేకుండా బస్సు కిక్కిరిసిపోయింది..ప్రయాణం మార్గంలోని స్టేజీలో కొందరు దిగుతున్నారు.. మరికొందరు ప్రయాణికులు ఎక్కుతున్నారు.. ఈ క్రమంలోనే.. బస్సు ఎక్కిన ఓ మహిళ ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురైంది..

దీంతో అప్రమత్తమైన డ్రైవర్.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఆర్టీసీ బస్సును తీసుకువెళ్లారు. వెంటనే అక్కడున్న సిబ్బంది.. ఆమెకు సకాలంలో చికిత్స అందించారు. ఈ ఘటన సోమవారం జరిగింది. కోదాడ నుండి ఖమ్మం వెళుతున్న ఆర్టీసీ బస్సులో నేలకొండపల్లి వద్ద ఓ మహిళ సృహ కోల్పోయి అస్వస్థతకు గురైంది.

బస్సు డ్రైవర్ సకాలంలో స్పందించడంతో.. సకాలంలో చికిత్స పొంది కొద్ది సేపటికే కోలుకుంది. దీనితో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై బస్సులోని ప్రయాణికులు, స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఈ ఘటన జరిగింది.120 మంది ప్రయాణికులు..

కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కోదాడ నుండి బయలుదేరి ఖమ్మం వెళుతోంది. కోదాడ బస్టాండ్ లోనే 120 మంది ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. నేలకొండపల్లికి రాగానే కేతమ్మ అనే మహిళ సొమ్మసిల్లి పడిపోయింది.

గమనించిన తోటి ప్రయాణికులు డ్రైవర్, కండక్టర్ కు ఈ విషయం చెప్పారు. దీంతో వారు బస్సు ఆపి వేరే ఆటోలో పంపాలని ప్రయత్నం చేశారు. స్పందన లేకపోవడంతో.. బస్సు వెనక్కి తిప్పి నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ఆ మహిళను తీసుకొని వచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయించారు.

డాక్టర్ లు వెంటనే చికిత్స అందించడంతో ఆ మహిళకు ప్రాణాపాయం తప్పింది. బస్సులో రద్దీ ఎక్కువగా ఉండటంతోనే ఊపిరాడక సృహ కోల్పోయినట్లు ఆమె భర్త తెలిపాడు. ఏదిఏమైనా డ్రైవరన్న సమయస్ఫూర్తితో వ్యవహరించారని.. దీంతో మహిళకు ప్రాణాపాయం తప్పిందని వైద్య సిబ్బంది.. స్థానికులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button