KhammamPoliticalTelangana

కొత్త పంచాయతీ భవనం సిద్ధం… ప్రారంభం మాత్రం శూన్యం!

కొత్త పంచాయతీ భవనం సిద్ధం… ప్రారంభం మాత్రం శూన్యం!

కొత్త పంచాయతీ భవనం సిద్ధం… ప్రారంభం మాత్రం శూన్యం!

తొమ్మిదేళ్లుగా అంగన్వాడి భవనంలోనే గ్రామపంచాయతీ కార్యకలాపాలు

ఏడాది క్రితమే సిద్ధమైన నూతన పంచాయతీ భవనం…

CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జులై 06 2026: ఏన్కూరు మండలంలోని మేడిపల్లి గ్రామపంచాయతీలో నూతన పంచాయతీ కార్యాలయ భవనం నిర్మాణం పూర్తై సంవత్సరం దాటినా ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి రాకపోవడంతో గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గత తొమ్మిది సంవత్సరాలుగా గ్రామపంచాయతీ కార్యాలయ కార్యకలాపాలు పాత అంగన్వాడి భవనంలోనే కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం కార్యాలయంగా వినియోగిస్తున్న అంగన్వాడి భవనం శిథిలావస్థకు చేరుకుందని స్థానికులు చెబుతున్నారు. భవనం పైకప్పు నుంచి పెచ్చులు రాలుతున్న నేపథ్యంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, వివిధ పనుల కోసం వచ్చే గ్రామ ప్రజల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షాకాలంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించాలనే ఉద్దేశంతో నిర్మించిన నూతన పంచాయతీ కార్యాలయ భవనం సిద్ధంగా ఉన్నప్పటికీ ఇంకా ప్రారంభం కాకపోవడంతో ప్రజలు త్వరితగతిన ప్రారంభించాలని కోరుతున్నారు. కొత్త భవనంలోకి కార్యాలయం మారితే ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణంలో సేవలు అందే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.

ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి, కొత్త పంచాయతీ కార్యాలయాన్ని త్వరలోనే ప్రారంభించి అన్ని పరిపాలనా కార్యకలాపాలను అక్కడికి తరలించేలా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఉపయోగిస్తున్న పాత భవనం పరిస్థితిని కూడా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button