NationalPolitical

కొత్త జంటపై పోలీస్‌ స్టేషన్‌లోనే దాడి

కొత్త జంటపై పోలీస్‌ స్టేషన్‌లోనే దాడి

కొత్త జంటపై పోలీస్‌ స్టేషన్‌లోనే దాడి

Social media viral : ప్రేమించి వివాహం చేసుకున్న జంటపై పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోనే హత్యాయత్నం చేసిన సంఘటన దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా బసవాపట్టణంలో జరిగింది. కుంచుగారనహళ్లికి చెందిన సిద్ధేశ్‌ (22)ని యువతి కుటుంబభ్యులు కత్తితో పొడిచారు.

వివరాలు.. బెంగుళూరులోని దాగినకట్టె గ్రామానికి చెందిన లీలావతి (18), సిద్ధేశ్‌ ప్రేమించుకున్నారు. పెద్దల అభీష్టానికి వ్యతిరేకంగా ఇటీవలే వివాహం చేసుకున్నారు.

లీలావతి కుటుంబం నుంచి బెదిరింపులు వస్తుండడంతో ఇద్దరూ జిల్లా ఎస్పీని కలిసి భద్రత కల్పించాలని కోరారు. ఎస్పీ సూచనల మేరకు ఇద్దరూ బసవాపట్టణ పోలీస్‌స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు చేయాలనుకున్నారు. స్టేషన్‌ ఆవరణలో ఉండగానే యువతి కుటుంబీకులు సిద్ధేశ్‌ను కత్తితో పొడిచి హత్యాయత్నం చేశారు.

యువతిని తమ వెంట తీసుకెళ్లారు. పోలీసులు సిద్ధేశ్‌ను దావణగెరెలోని ఎస్‌ఎస్‌ ఆస్పత్రికి తరలించారు. అతనికి వైద్యులు శస్త్రచికిత్స చేసి ఐసీయూలో ఉంచారు. పోలీసు స్టేషన్‌లోనే హత్యాయత్నం జరగడంతో పోలీసులపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button