MuluguPoliticalTelangana

చుంచుపల్లి ఇసుక ర్యాంపుల వివాదం వెనకున్న వాస్తవాలు ఏంటి.?

చుంచుపల్లి ఇసుక ర్యాంపుల వివాదం వెనకున్న వాస్తవాలు ఏంటి.?

చుంచుపల్లి ఇసుక ర్యాంపుల వివాదం వెనకున్న వాస్తవాలు ఏంటి.?

“సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న ఒప్పందా పత్రాల మాటేంటి.? కలెక్టర్ సాబ్.”

“పాత అంశాలను ఇప్పుడు తెరపైకి తేవడం వెనుక ఉద్దేశం ఏమిటి?”

“ములుగు జిల్లా రాజకీయ వర్గాల్లో ఇసుక చిచ్చు. రోజు రోజుకి రచ్చ రచ్చ.!”

“బెల్లంకొండ భాస్కరరావు ఇన్ని ఏళ్ల మౌనం వెనుక అసలు ఆంతర్యమేంటి..?”

“ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు న్యాయం కోసమా..? లేక వ్యక్తిగత కక్ష సాధింపులో భాగమా..?”

“అధికార పార్టీ నాయకులపైనే ఆరోపణలు చేయడానికి కారణాలేమిటి..?”

“అక్క అభివృద్ధిని నేరుగా అడ్డుకోలేక తమ్ముడి ఇజ్జత్ ని బదలం చేస్తున్నారా.?”

“పార్టీల ఎత్తుగడలు, ప్రజల్లో చర్చకు దారితీస్తున్న పరిణామాలు.”

“ప్రభుత్వానికి సొసైటీ సభ్యులకి మధ్య కునుకు మీద నిద్రలేని కాంట్రాక్టర్స్.”

“గిరిజన ఉపాధికి అడ్డొస్తే” ఊరుకునేదే లేదు సొసైటీ సభ్యుల డిమాండ్.”

“ములుగు జిల్లా సికే న్యూస్ ప్రతినిధి భార్గవ్ “

ములుగు జిల్లాలో ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, ఇసుక రీచ్‌లకు సంబంధించిన వివాదాలు, పరస్పర ఆరోపణలు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెల్లంకొండ భాస్కరరావు వ్యవహార శైలి, ఆయన మౌనం, అలాగే చేసిన ఆరోపణలపై అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు చేసిన ఫిర్యాదు పూర్తిగా ప్రజా ప్రయోజనం, మరియు న్యాయం కోసం చేశారా.? లేక వ్యక్తిగత విభేదాల నేపథ్యంలోనా.? అనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.
మరోవైపు, నేరుగా అధికార పార్టీ నాయకులపైనే ఆరోపణలు చేయడం వెనుక ఉన్న ఆధారాలేమిటి? సంబంధిత అంశాలపై పూర్తి వివరాలు ప్రజల ముందుకు వస్తాయా.? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోపణలు చేసిన పక్షం తమ వద్ద ఉన్న ఆధారాలను బహిర్గతం చేయాలని, అదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా తమ వివరణ ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు..
అలాగే, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయ వివాదాలకు కారణమవుతున్నాయా.? లేక పరస్పర విమర్శలతో అనవసర అపోహలు సృష్టిస్తున్నారా.? అనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది..
ప్రస్తుతం వినిపిస్తున్న ఆరోపణలు, ప్రతిఆరోపణలపై వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సంబంధిత అధికారులు, రాజకీయ నాయకులు, ఫిర్యాదు చేసిన పక్షం స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇసుక సొసైటీలు కోరుతున్నారు..
ములుగు జిల్లా మంగపేట మండలం చుంచుపల్లి ప్రాంతంలోని ఇసుక ర్యాంపులకు సంబంధించిన వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల బెల్లంకొండ వెంకటేశ్వరరావు అలియాస్ భాస్కర్‌రావు చేసిన ఆరోపణల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో, స్థానిక ప్రజల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
భాస్కర్‌రావు తనకు 2010 సంవత్సరం నుంచి అన్యాయం జరుగుతోందని పేర్కొంటున్న నేపథ్యంలో, గత పదిహేనేళ్లలో చుంచుపల్లి ప్రాంతంలో ఎన్ని ఇసుక ర్యాంపులు నిర్వహించబడ్డాయి.? ఆ సమయంలో ఆయన ఎందుకు అధికారికంగా ఈ అంశాన్ని బలంగా ప్రస్తావించలేదు? ఇప్పుడు మాత్రమే ఈ వివాదాన్ని తెరపైకి తీసుకురావడానికి కారణాలేమిటి? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
స్థానికంగా వినిపిస్తున్న అభిప్రాయాల ప్రకారం, గతంలో ర్యాంపుల నిర్వహణ, ఒప్పందాలు, లావాదేవీలు, అనుమతుల అంశాలపై పూర్తి వివరాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా 2020లో జరిగినట్లు చెప్పబడుతున్న ఒప్పందాల పరిస్థితి ఏమిటి? వాటికి సంబంధించిన పత్రాలు, అధికారిక రికార్డులు ఏమి చెబుతున్నాయి? అనే అంశాలపై కూడా స్పష్టత రావాలని కోరుతున్నారు.
ఇటీవల చేసిన ఆరోపణల్లో అధికార పార్టీ నాయకుల పేర్లు ప్రస్తావించడంపై కూడా రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది వాస్తవాలను వెలికితీసే ప్రయత్నమని అభిప్రాయపడుతుండగా, మరికొందరు సంబంధిత ఆధారాలు లేకుండా నాయకుల పేర్లను ప్రస్తావించడం వల్ల అనవసర రాజకీయ వివాదం ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, గతంలో ర్యాంపుల కేటాయింపులు, అనుమతులు, ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు, సంబంధిత పత్రాలను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. వాస్తవాలు ఏవైనా ఉంటే అవి అధికారిక దర్యాప్తు ద్వారా బయటపడాలని, నిరాధార ఆరోపణలు అయితే వాటిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు.
ఈ వివాదానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక దర్యాప్తు నివేదిక లేదా న్యాయస్థాన తీర్పు వెలువడలేదు. అందువల్ల ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఆరోపణలు, ప్రతిఆరోపణలపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని మంగపేట మండల ఇసుక సొసైటీ సభ్యులు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button