
ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం… ప్రైవేట్ అంబులెన్స్ బీభత్సం
Web desc : కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆదివారం అర్ధరాత్రి ఓ ప్రైవేట్ అంబులెన్స్ బీభత్సం సృష్టించింది. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా అంబులెన్స్‌ను నడపడంతో ఆస్పత్రిలోని జనరేటర్ ధ్వంసమైంది.ఆటో డ్రైవర్ వికృతం..
ఆస్పత్రి బయట నిలిపి ఉంచిన ఓ ప్రైవేట్ అంబులెన్స్‌ను ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఓ ఆటో డ్రైవర్ స్టార్ట్ చేశాడు. అంబులెన్స్ డ్రైవర్‌ను పక్కకు జరిపి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఆటో డ్రైవర్ ఒక్కసారిగా అంబులెన్స్‌తో వేగంగా దూసుకుపోయాడు. అదుపు తప్పిన అంబులెన్స్ నేరుగా ఆస్పత్రి ఆవరణలో ఉన్న జనరేటర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జనరేటర్ స్వల్పంగా డ్యామేజ్ అయింది.
సిబ్బంది, రోగుల్లో భయం.. అర్ధరాత్రి ఒక్కసారిగా వినిపించిన శబ్దానికి ఆస్పత్రిలో ఉన్న రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఏమైందో అర్థం కాక అంతా ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.
జనరేటర్ రిపేర్, పోలీసులకు ఫిర్యాదు.. ప్రస్తుతం డ్యామేజ్ అయిన జనరేటర్‌ను రిపేర్ చేయిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఘటన పై ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబులెన్స్‌ను అక్రమంగా తీసుకెళ్లి ప్రమాదం సృష్టించిన ఆటో డ్రైవర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.




