
సురవరం ప్రతాపరెడ్డి ప్రెస్ క్లబ్ నిర్మాణానికి రూ.20 లక్షల నిధులు మంజూరు
వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవ
ప్రత్యేక అభివృద్ధి నిధి (SDF) ద్వారా పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
వనపర్తి జిల్లా కేంద్రంలో సురవరం ప్రతాపరెడ్డి ప్రెస్ క్లబ్ నిర్మాణానికి రూ.20 లక్షల ప్రత్యేక అభివృద్ధి నిధులు (SDF) మంజూరయ్యాయి
ఇటీవల రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార & ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వనపర్తి పర్యటనకు వచ్చిన సందర్భంగా, స్థానిక జర్నలిస్టులు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి సమక్షంలో మంత్రికి వినతిపత్రం అందజేశారు.
జర్నలిస్టులకు శాశ్వత వేదికగా నిలిచేలా సురవరం ప్రతాపరెడ్డి పేరుతో ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మించాలని కోరారు.
జర్నలిస్టుల విజ్ఞప్తికి వెంటనే సానుకూలంగా స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి రూ.20 లక్షలు మంజూరు చేయించారు. ఈ మేరకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది.
ఈ భవనం జర్నలిస్టుల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, వృత్తి అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రంగా ఉపయోగపడటంతో పాటు ప్రజలకు, మీడియాకు మధ్య మరింత సమర్థవంతమైన సమాచార వేదికగా నిలువనుంది
ఈ సందర్భంగా జర్నలిస్టుల కోరికను వెంటనే మన్నించి, అడిగిందే పిడవుగా రూ.20 లక్షల నిధులు మంజూరు చేసిన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే జర్నలిస్టుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ చిత్తశుద్ధితో పనిచేస్తోందని, మీడియా అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.




