KhammamPoliticalTelangana

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలి: ప్రిన్సిపాల్ వేము రాజు

సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్‌ నరసింహ
ఏన్కూరు సెప్టెంబర్‌ 19 2026: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని ఏన్కూరు గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ వేము రాజు అన్నారు. శనివారం స్థానిక గురుకుల విద్యాలయంలో ఎక్స్‌లెన్స్ ఫర్ మిషన్ లైఫ్ కార్యక్రమంలో భాగంగా ‘ఏక్ పేడ్ మాకే నామ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వేము రాజు విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, చెట్ల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు.

చెట్లను విరివిగా పెంచకపోతే భవిష్యత్‌లో పర్యావరణ సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అన్నారు. స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన జీవనానికి పచ్చదనం ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే పర్యావరణ పరిరక్షణతో పాటు సేవా కార్యక్రమాలు, నైతిక విలువలను అలవర్చుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీఓ శ్రీదేవి, ఏటీపీ సునీల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button