Andhra PradeshPolitical

వేధింపులు తట్టుకోలేక నదిలోకి దూకి ఆత్మ*హత్యాయత్నం… సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు

వేధింపులు తట్టుకోలేక నదిలోకి దూకి ఆత్మ*హత్యాయత్నం… సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు

వేధింపులు తట్టుకోలేక నదిలోకి దూకి ఆత్మ*హత్యాయత్నం… సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు

web desc : కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో పంచాయతీ రాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న నూకరాజు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేధింపులు తట్టుకోలేక ఆయన, తన భార్య మీనా, కుమార్తె సౌజన్యతో కలిసి ఆదివారం రాత్రి రాజమహేంద్రవరంలోని రోడ్ కమ్ రైలు వంతెనపై నుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే ఈ ఘటనలో నూకరాజు మనవడు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు.

కాకినాడలోని అశోక్ నగర్‌కు చెందిన నూకరాజు కుటుంబం కారులో రాజమహేంద్రవరం రోడ్-కమ్-రైలు వంతెన వద్దకు చేరుకుని రాత్రి 11.30 గంటల సమయంలో గోదావరిలోకి దూకారు. ఆ సమయంలో వంతెనపై నుంచి వెళ్తున్న ఒక వ్యక్తి గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు తక్షణమే స్పందించి, నదిలోని లంక గ్రామానికి చెందిన స్థానిక మత్స్యకారులను రంగంలోకి దించారు. వేగంగా స్పందించిన మత్స్యకారులు 10 ఏళ్ల బాలుడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రస్తుతం ఆ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతనికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.ఘటనా స్థలంలో నూకరాజు రాసిన ఒక లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాకినాడలోని పీఆర్‌ఓ రైఫిల్ షూటింగ్ అకాడమీ నడుపుతున్న ఎస్‌కె.సాధిక్ ఖాన్ అనే వ్యక్తి తమ కుటుంబ తీవ్రంగా వేధిస్తున్నాడని ఆ నోట్‌లో పేర్కొన్నారు. సౌజన్య భర్త అంటే నూకరాజు అల్లుడు ఈ ఏడాది జులైలో మృతి చెందగా, అప్పటి నుంచి సాధిక్ ఖాన్ ఆమె వెంటే పడుతూ ఇబ్బంది పెడుతున్నాడని లేఖలో తెలిపారు. మనుమడిని, కుమార్తెను, తనను చంపేస్తానని బెదిరించి, తమ బ్యాంకు ఖాతా పుస్తకాలు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నాడని లేఖలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

వేధింపులు తాళలేకే తమ కుటుంబం ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ లేఖను కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సంబోధిస్తూ రాశారు. సౌత్ డివిజన్ డీఎస్పీ ఎ. శివప్రియ మాట్లాడుతూ.. ఆ నోట్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు. రాజమహేంద్రవరం టూ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి. శివగణేష్ పర్యవేక్షణలో స్థానిక మత్స్యకారులతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

కాగా ఈ ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం కె. పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన ముగ్గురి కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని రాజమహేంద్రవరం పోలీసులను ఆదేశించారు. కాకినాడ ఎస్పీ జి. బిందు మాధవ్, ఈస్ట్ గోదావరి ఎస్పీ డి. నరసింహ కిషోర్‌లతో పవన్ కళ్యాణ్ మాట్లాడి దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆ కుటుంబాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button